తాండూరులో రైతుల ఆందోళన | farmers protest at tanduru market yard | Sakshi
Sakshi News home page

తాండూరులో రైతుల ఆందోళన

Nov 19 2015 3:41 PM | Updated on Jun 4 2019 5:16 PM

తాండూరు మార్కెట్ యార్డులో గురువారం రైతులు ఆందోళనకు దిగడంతో కందుల విక్రయాలు నిలిచిపోయాయి.

రంగారెడ్డి జిల్లా: తాండూరు మార్కెట్ యార్డులో గురువారం రైతులు ఆందోళనకు దిగడంతో కందుల విక్రయాలు నిలిచిపోయాయి. క్వింటాలుకు రూ.12 వేలు చెల్లించాలంటూ రైతులు అధికారులు, వ్యాపారులు చర్చలు జరిపారు.

బుధవారం క్వింటాలుకు మోడల్ ధర 11,600 కాగా గురువారం రూ.11,300 మాత్రమే ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రావటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుల ధర పెరగటానికి బదులు తగ్గడంపై రైతులు వ్యాపారులతో గొడవకు దిగారు. రూ.12వేలు చెల్లించాల్సిందేనంటూ రైతులు విక్రయాలను నిలిపివేసి నిరసన తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement