అవంచలో రైతు ఆత్మహత్య | farmer commits suicide in Avanca | Sakshi
Sakshi News home page

అవంచలో రైతు ఆత్మహత్య

Oct 21 2015 1:07 PM | Updated on Oct 1 2018 2:44 PM

అప్పుల బాదతాళలేక ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో బుధవారం జరిగింది.

అప్పుల బాదతాళలేక ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో బుధవారం జరిగింది. అవంచ గ్రామానికి చెందిన కుమ్మరి భాస్కర్ (38) పంట సాగుకోసం రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పుల బాధ తాళలేక బుధవారం ఉదయం తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కూతళ్లు ఉన్నారు. పెద్దకూతరు పూజితకు పెళ్ళి చేశాడు. రెండో కుమార్తె అశ్విని పదో తరగతి చదువుతోంది. పండగ పూట ఇంటి పెద్ద చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement