ఎస్పీ గన్‌మేన్‌ ఆత్మహత్య | SP gunman commits suicide | Sakshi
Sakshi News home page

ఎస్పీ గన్‌మేన్‌ ఆత్మహత్య

Oct 12 2026 5:21 AM | Updated on Oct 12 2026 5:21 AM

SP gunman commits suicide

వీరన్న (ఫైల్‌)

క్రికెట్‌ బెట్టింగులతో అప్పులపాలు

ఆర్థిక సమస్యలతో ఉరేసుకుని బలవన్మరణం

వేటపాలెం: క్రికెట్‌ బెట్టింగుల్లో నష్టపోయి అప్పులపాలై చివరకు ఆర్థిక ఇబ్బందులతో బాపట్ల జిల్లా ఎస్పీ గన్‌మేన్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ రామానగర్‌లో ఉంటున్న లేళ్ల వీరన్న (47) ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎస్పీ గన్‌మేన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూ బాపట్ల వెళ్లి డ్యూటీ చేసి ఇంటికి వస్తుంటాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనశ్శాంతి కోల్పోయి రెండు రోజుల కిందట తాను ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు చెప్పాడు. ఆమె వద్దని నచ్చజెప్పిందని సమాచారం. 

ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బయటకు వచ్చిన వీరన్న రామన్నపేట పంచాయతీ శివారు కనక నాగవరపమ్మ దేవస్థానికి వెళ్లే మార్గంలో గ్రామ పంచాయతీ మంచినీటి బావుల వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మార్గం గుండా వెళ్లే వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి ఎస్పీ గన్‌మేన్‌గా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు క్రికెట్‌ బెట్టింగ్‌ల కారణంగా రూ.లక్షల్లో అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. అప్పులు తీర్చలేనని మనోవ్యథతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement