రైతు బలవన్మరణం | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు బలవన్మరణం

Sep 4 2015 3:12 PM | Updated on Nov 6 2018 7:56 PM

సాగులో నష్టాలు రావడంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బషీరాబాద్ (రంగారెడ్డి) : సాగులో నష్టాలు రావడంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లాలోని యాలాల మండలం ఇంకెపల్లి గ్రామానికి చెందిన కాశప్ప(40) అనే రైతు  బషీరాబాద్ మండలంలో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే పంట దిగుబడి సరిగా లేకపోవడం, చేసిన  అప్పులు తీరే మార్గం లేకపోవడంతో కాశప్ప.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement