నకిలీ కరెన్సీ చెలామణి ముఠా అరెస్ట్ | fake currency gang arrested in mahabubnagar district | Sakshi
Sakshi News home page

నకిలీ కరెన్సీ చెలామణి ముఠా అరెస్ట్

May 13 2016 12:34 PM | Updated on Sep 4 2017 12:02 AM

నకిలీ చెరెన్సీ చెలామణి చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు.

జడ్చర్ల: నకిలీ చెరెన్సీ చెలామణి చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.80 వేల విలువైన 1000 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠా నాయకుడు అరుణ్ పరారీలో ఉన్నాడు. వీరంతా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించి, మిగతా నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను పంపినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement