ఈసెట్, ఎంసెట్‌ పరీక్షలు వాయిదా | Extension Of Entrance Exams Applications | Sakshi
Sakshi News home page

సెట్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

Apr 2 2020 4:17 AM | Updated on Apr 2 2020 9:45 AM

Extension Of Entrance Exams Applications - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20 వరకు ఉన్నత విద్యామండలి పొడిగించింది. లాక్‌డౌన్‌ ఈనెల 15 వరకు ఉన్న నేపథ్యంలో గడువు పొడిగించినట్టు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీలాసెట్, ఎడ్‌సెట్‌ దరఖాస్తుల గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. ఐసెట్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు మాత్రం ఈనెల 30 వరకు ఉంది. ఇక మే 2న నిర్వహించాల్సిన ఈసెట్, 4, 5, 7, 9, 11 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్‌ పరీక్షలు వాయిదా పడనున్నాయి. (కేవలం 29 సబ్జెక్టులకే పరీక్షలు )

ఏప్రిల్‌ 20: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
ఏప్రిల్‌ 22: రూ.500 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్‌ 24: రూ.1,000 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్‌ 24 – మే 1: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌
ఏప్రిల్‌ 27: రూ.5,000 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్‌ 29: రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ  

Advertisement
 
Advertisement
Advertisement