
'నా బంగారు తల్లి'కి వినోద పన్ను మినహాయింపు
నా బంగారు తల్లి సినిమాను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమాపై 100 శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్: నా బంగారు తల్లి సినిమాకు వినోదపు పన్ను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాపై వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సమాజానికి పనికివచ్చే సినిమాలను తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వాస్తవమైన కథను ఆధారంగా చేసుకుని హ్యుమన్ ట్రాఫికింగ్ అనే పాయింట్ ద్వారా వచ్చిన 'నా బంగారు తల్లి' సినిమా ప్రేక్షుకులను ఎంతో ఆకట్టుకుంది. వ్యభిచార ముఠా చేతిలో చిక్కిన యువతి కష్టాలు పడటం, అలాగే అక్కడినుంచి తప్పించుకునేందుకు యువతి ప్రయత్నించే సన్నివేశాలను దర్శకులు బాగా తెరకెక్కించారు. ఈ సినిమా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే.