రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం తోల్‌కట్టలో బుధవారం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో తండ్రీకొడుకు మృతి
Mar 8 2017 2:08 PM | Updated on Sep 28 2018 3:41 PM
మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం తోల్‌కట్టలో బుధవారం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకులిద్దరూ మృతి చెందారు. పొలం వద్ద అడవి పందులకు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ కు గురయ్యారు. వ‍్యవసాయ పొలానికి నీళ‍్లు పెట‍్టేందుకు వెళ్ళిన తండ్రీకొడుకులు బొలుగిద‍్ద గోపాల్ (55), రవికుమార్(23) కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మరణించారు. తండ్రీ కొడుకుల మృతితో కుటుంబంతో పాటు, గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement


