చిక్కుల్లో టీఆర్‌ఎస్‌ నేత ఏనుగు.. | Election Commission Inquiry On Enugu Ravinder Reddy Issue | Sakshi
Sakshi News home page

Oct 4 2018 2:59 PM | Updated on Oct 4 2018 5:46 PM

Election Commission Inquiry On Enugu Ravinder Reddy Issue - Sakshi

సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్కల్ గ్రామంలో ఓట్ల కోసం మహిళా సంఘాలను ప్రలోభాలకు గురి చేసేలా ఆయన మాట్లాడారని ప్రతిపక్షాలు ఎలక్షన్‌ కమిషన్‌ను ఆశ్రయించాయి. ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ ఈ తతంగంపై విచారణ జరుపుతున్నారు. ప్రతిపక్షాలు సమర్పించిన వీడియో పుటేజీలను కూడా ఈసీ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఈసీ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్‌ రంజీత్‌ సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement