జిల్లా ఓటర్లు 8,14,271

Election Commission announced Suryapet District Voter List - Sakshi

ఓటరు జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం

4,06,233 మంది పురుషులు

4,08,000 మంది స్త్రీలు

తుంగతుర్తిలో అత్యధికం, సూర్యాపేటలో అత్యల్పం

దురాజ్‌పల్లి(సూర్యాపేట) : జిల్లా ఓటర్ల లెక్కలు తేలాయి. గతంలో కంటే ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగింది. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,14,271 మంది ఓటర్లు ఉండగా ఇందులో 4,06, 233 మంది పురుషులు, 4,08,000 మంది స్త్రీలు,  38 మంది థర్డ్‌ జెండర్‌ ఉన్నారు. అత్యధికంగా తుంగతుర్తి నియోజకవర్గంలో 2,16,617 మంది, అత్యల్పంగా సూర్యాపేట నియోజకవర్గంలో 1,87,657 మంది ఓటర్లు ఉన్నారు.

నియోజకవర్గాల వారీగా ఓటర్లు ఇలా...
జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల పరిధిలో 997 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో 8,14,271మంది ఓటర్లు ఉన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 232 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 1,87,657 మంది ఓటర్లు ఉండగా 94,495 మంది స్త్రీలు, 93,153 మంది పురుషులు, తొమ్మిది మంది ఇతర ఓటర్లు ఉన్నారు. అదే విధంగా కోదాడ నియోజకవర్గంలో 243 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,04,392 మంది ఓటర్లు ఉండగా 1,31,064 మంది స్త్రీలు, 1,12,021 మంది పురుషులు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. తుంగతుర్తి నియోజకర్గంలో 279 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,16,617మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,06,870 మంది స్త్రీలు, 1,09,733 మంది పురుషులు, 14మంది ఇతరులు ఉన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 243 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,05,605 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,03,471 మంది స్త్రీలు,1,02,126 మంది పురుషులు, 8మంది ఇతర ఓటర్లు ఉన్నారు.

పెరిగిన ఓటర్లు...
జిల్లాలో గత నెల ప్రచురించిన ఓటర్ల  సంఖ్య కంటే తుది ఓటర్ల జాబితాలో ఓటర్లు భారీగా పెరిగారు. జిల్లా అధికారులు ఓటరు నమోదు పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఓటరు జాబితాతో పోల్చితే హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 6, 287 మంది ఓటర్లు, కోదాడలో 5, 603 మంది, సూర్యాపేటలో 7,984 మంది ఓటర్లు, తుంగతుర్తి నియోజకవర్గంలో 7,298 మంది ఓటర్లు పెరిగారు.

నియోజక వర్గాల వారీగా ఓటర్ల సంఖ్య
నియోజకవర్గం పేరు     పురుషులు     మహిళలు          ఇతరులు
హుజూర్‌నగర్‌            1,02,126         1,03,471           8
కోదాడ                     1,02,221         1,03,164           7
సూర్యాపేట                93,153             94,4959
తుంగతుర్తి                1,09,733         1,06,870           14 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top