కొత్తగూడెంలో గాలి,వాన బీభత్సం | eavy rain, wind sweeps in kothagudem | Sakshi
Sakshi News home page

కొత్తగూడెంలో గాలి,వాన బీభత్సం

Mar 10 2017 8:00 PM | Updated on Aug 25 2018 5:39 PM

కొత్తగూడెంలో గాలి,వాన బీభత్సం - Sakshi

కొత్తగూడెంలో గాలి,వాన బీభత్సం

జిల్లాను శుక్రవారం భారీ గాలి, వాన కుదిపేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు వృక్షాలు కూలిపోయాయి.

కొత్తగూడెం : జిల్లాను శుక్రవారం భారీ గాలి, వాన కుదిపేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు వృక్షాలు కూలిపోయాయి. మున్సిపాలిటీ 29 వ వార్డులో గాలివాన బీభత్సానికి భారీ వృక్షం నేలకూలి విద్యుత్‌ తీగలపై పడటంతో నాలుగు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో విద్యుత్‌ లైన్ల కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రైటర్‌బస్తీలో గోడ కూలడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు.

లక్ష్మీదేవిపల్లిలో మరో భారీ మర్రి వృక్షం హోటల్‌పై కూలడంతో ఒకరికి గాయాలయ్యాయి. రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. పంటపొలాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసిపోయింది. ఎర్రగుంట శాంతినగర్‌కు చెందిన మంద దుర్గమ్మ(50) అనే మహిళపై పిడుగు పడటంతో మృతిచెందింది. చిన్నలక్ష్మి అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

 











 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement