మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయ్? | Down why alcohol sales? | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?

Aug 23 2015 1:11 AM | Updated on Sep 3 2017 7:56 AM

నల్లగొండ : జిల్లాలో మద్యం అమ్మకాలు పడిపోవడానికి గల కారణం ఏమిటి..? పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా అవుతుందా..?

నల్లగొండ : జిల్లాలో మద్యం అమ్మకాలు పడిపోవడానికి గల కారణం ఏమిటి..? పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా అవుతుందా..?  ఏ కారణం చేత జూలై మాసంలో మద్యం అమ్మకాలు పడిపోయాయి..? అని ఎక్సైజ్ శాఖ క మిషనర్ ఆర్. చంద్రవదన్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల పై ప్రశ్నల వర్షం కురిపించారు. శ నివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో ప్రధానంగా రెండు అంశాల మీద చర్చ జరిగింది. దాంట్లో మొదటిది తగ్గిన మద్యం అమ్మకాల పై కాగా...రెండోది క్రైం రేటుకు సంబంధించి. మద్యం అమ్మకాలు తగ్గడానికి గల కారణం పోలీసుల దాడులనేనని ఇన్‌స్పెక్టర్లు స్పష్టం చేశారు.
 
  గ్రామాల్లో బెల్టుదుకాణాల పై పోలీసు శాఖ దాడులు చే స్తున్నందునే మద్యం అమ్మకాలు పడిపోయాయని తేల్చిచెప్పారు. సారా అమ్మకాల జోలికి వెళ్లిన పోలీస్ శాఖ కేవలం బెల్టుదుకాణాల పైనే కేసులు నమోదు చేయడం ఎక్సైజ్ శాఖ పై తీవ్ర ప్రభావం చూపుతోందని కమిషనర్‌కు బదులిచ్చారు. బెల్టుదుకాణాలు, సారా అమ్మకాలను రెండింటి పైనే దాడులు చేసి కేసులు నమోదు చేసే అధికారులు రెండు శాఖలకు ఉన్నప్పుడు కేవలం బెల్టుదుకాణాల పైనే పోలీస్ శాఖ దృష్టి సారించిందని అధికా రులు వివరించినట్లు తెలిసింది. దీని పై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ...నాటుసారా , బెల్లం అమ్మకాల పై సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారని...ఎట్టి పరిస్థితుల్లో గ్రా మాల్లో నాటుసారా అమ్మకాలు జరగడానికి వీల్లేదని ఇన్‌స్పెక్టర్లుకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
 
 ప్రభుత్వం వారం రోజుల్లో కొత్త మద్యం పాలసీ ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి గ్రామాల్లో సారా అమ్మకాలు లేకుండా కేసులు నమోదు పెంచాలని కమిషనర్ దిశా నిర్దేశం చేశారు. కేసులు నమోదు పట్ల ఎవరైన సీఐలు, ఎస్‌ఐలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు బాధ్యులైన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో డీసీ అనుసూయ దేవీ, ఈఎస్‌లు దత్తురాజుగౌడ్, శ్రీనివాస్‌రావు, ఎస్టీఎఫ్ ఏసీ నాగేశ్వరరావు, ఎస్టీఎఫ్ ఏఎస్పీ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement