మతం మారాలని అత్తపై దాడిచేసిన కోడలు:కేసు నమోదు | doughter in law attacked her aunty | Sakshi
Sakshi News home page

మతం మారాలని అత్తపై దాడిచేసిన కోడలు:కేసు నమోదు

Apr 3 2015 11:20 PM | Updated on Sep 4 2018 5:16 PM

మతం మారాలంటూ అత్తపై కోడలు దాడి చేసిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

నాగోలు: మతం మారాలంటూ అత్తపై కోడలు దాడి చేసిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్‌బీనగర్ ఎస్‌బీహెచ్ కాలనీలో నివాసముండే యోగిత, లింగంలు భార్యాభర్తులు. యోగిత కొన్నే ఏళ్ల కిందట మరో మతంలో చేరింది. అలాగే ఇంట్లో ఉంటున్న అత్త వెంకటమ్మను కూడా మత మార్పిడికి పోత్సహించింది.

 

దీంతో ఆమె నిరాకరించడంతో యోగిత అత్తపై దాడి చేసి చంపుతా అని బెదిరించింది.ంతో అత్త ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement