breaking news
doughter in law
-
ఆ అత్తమ్మ ప్రేమకు.. కోమానే జయించింది ఆ కోడలు!
అత్తా కోడళ్లు అనగానే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటాయి ఆ ఇద్దరి సంబంధబాంధవ్యాలు. కానీ కొందరు అత్తలు అమ్మనే మరిపించేలా కోడలికి ప్రేమను అందించే వాళ్లు కూడా ఉన్నారు. అంతేగాదు కోడలకు అన్నివిధాల కొండంత అండగా నిలబడుతుంటారు. ఇవాళ అత్తల దినోత్సవం నేపథ్యంలో కోమాలో ఉన్న కోడలిని కంటికిరెప్పలా సాకి, కోలుకునేలా చేసిన ఓ అత్తమ్మ కథ గురించి తెలుసుకుందామా.చైనాలో 68 ఏళ్ల జువాన్ ఫెంగింగ్ అనే మహిళ కోమాలో ఉన్న తన కోడలిని కన్న కూతురిలా సాకింది. బెడ్‌కే పరిమితమై ఉంటే అన్ని సపర్యలు చేసింది. ఆమె కోడలు క్సూ పెళ్లైన నెలకే ట్రక్కు ఢీకొని మెదడు దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లిపోయింది. శారీరక సవాళ్లు, నిరంతర సంరక్షణ తదితరాలు అవసరమైనా..వెనక్కి తగ్గకుండా ఆ అత్త ఆ కోడలికి అన్ని విధాల మద్దతిస్తూ కంటికి రెప్పలా చూసుకుంది ఆమెను. 2009లో ప్రమాదం జరగగా అప్పటి నుంచి క్సూ కోమాలోనే ఉంది. కానీ ఫెంగింగ్ ఆమెను తన సొంతకూతురిలా చూసుకుంది. ఆమె సంరక్షణ బాధ్యతలన్నీ ఆమెనే స్వయంగా చూసుకుంది. తన కొడుకుని పెళ్లి చూసుకున్నంత మాత్రన ఆమెను వదిలిపెట్టలేనని చెబుతుండటం విశేషం. ఆమె తమ కుటుంబంలో భాగమయ్యాక, సొంత బిడ్డగానే భావించానని చెబుతోంది ఫెంగింగ్. మల మూత్రాదుల దగ్గర నుంచి మంచానికే పరిమితమవ్వడంతో శరీరం పుండ్లు పడకుండా చూసుకోవడం వరకు అన్నింటిని చాలా ఓపికతో చేసేది. ఆ అత్తమ్మ సపర్యలకు కోడలు క్సూ కోలుకుని స్పృహలోకి వచ్చింది. అయితే ప్రమాదం వల్ల బ్రెయిన్‌కి అయిన నష్టం కారణంగా గ్రహణశక్తి కోల్పోయి నాలుగేళ్ల చిన్నారిలా మారిపోయింది ఆమె ప్రవర్తన. అయినప్పటికీ..నడక నేర్పుస్తూ..వ్యాయామాలు చేయిస్తోంది. నెమ్మదిగా మాట్లాడేలా చేస్తోంది. అంతేగాదు చిన్నచిన్నగా వంటలు కూడా చేస్తోంది. ఆ అత్త చేసిన సేవలకు తగినట్లుగానే కోడలు క్సూలో మెరుగుదల కనిపించడం విశేషం. అయితే ఫెంగింగ్ మాత్రం ఆమె ఇంకా పూర్తిస్థాయిలో మెరుగుపడాలని ఆశిస్తోంది. ఎందుకంటే రేపు తను లేకపోయినా..ఆమె తను తినడానికి ఏదో ఒకటి వండుకోగలుగుతుంది కదా అని అంటోంది. అంతేగాదు ఒకవేళ తను చనిపోయినా..క్సూ బాధ్యతను కుమారుడిని నిర్వర్తించమని కోరడం విశేషం. కానీ కోడలు కోలుకోవడం కోసం ఆ అత్త ఫెంగింగ్ ఏ ఐదో, పదో ఏళ్లు కాదు..ఏకంగా 17 ఏళ్ల పాటు నిరంతరాయంగా సపర్యలు చేసింది ఈ అత్త. అంత గొప్ప మనసున్న అత్తను పొందిన ఆ కోడలు నిజంగా అదృష్టవంతురాలు కదా..!.ఇదీ చదవండి: నేడు ‘అత్తల దినోత్సవం’ -
లైంగికదాడి, హత్య కేసులో...
నెల్లూరు(లీగల్) : కోడలిపై మామ లైంగికదాడి చేసి హత్య చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు నెల్లూరులోని మైపాడు రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ కాలేషాకు జీవిత ఖైదుతోపాటు నూ.1500ల జరిమానా, భర్త షేక్.రహిమాన్‌కు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.500లు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్యామలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. వేణుగోపాల్‌నగర్‌కు చెందిన రసూలమ్మ అలియాజ్ రసూలితో అదే ప్రాంతానికి చెందిన షేక్ రహిమాన్‌కు 2008లో పెద్దల సమక్షంలో వివాహమైంది. రహిమాన్ చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధించడం, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టేసేవాడు. భర్తతోపాటు మామ కాలేషా, అత్త ఖాదర్బీలు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి రూ.50వేలు రొక్కాన్ని తీసుకు రమ్మని వేధించారు. ఆమె విషయాన్ని తన అన్న మస్తాన్‌బాబాకు చెప్పింది. మస్తాన్‌బాబు వారికి నచ్చజెప్పి వెళ్లారు. రహిమాన్ తన కాపురాన్ని వేణుగోపాల్‌నగర్ నుంచి రాజీవ్‌గాంధీ ప్రాంతంలోకి మార్చాడు. కోడలిని మామ తన కోరిక తీర్చమని అడుగుతుండేవాడు. ఆమె నిరాకరిస్తూ ఉండేది. అదును కోసం కాచుకొని ఉన్నాడు. 22-08-2012న భర్త రహిమాన్ , మామ పనికి వెళ్లారు. వెళ్లిన గంటకే మామ తిరిగి ఉంటికి వచ్చేశాడు. అదే అదునుగా భావించి కోడలిపై అఘాయిత్యం చేయబోగా ఆమె కేకలు వేయడంతో ఒక చేత్తో నోరుమూసి రెండో చేత్తో కడుపులో గుద్ది మంచంపై పడేసి లైంగికదాడికి యత్నించాడు. ఆమె పారిపోయేందుకు ప్రయత్నించింది. ఇంతలో మంచం కోడుతో ఆమె తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి చీరను మెడకు వేసి వేలాడదీసి వెళ్లాడు. అనంతరం భర్త రహిమాన్, మామ కాలేషా ఇద్దరూ సాయంత్రం 4గంటలకు ఇంటికి చేరుకున్నారు. వారి ముందు మామ ఆమెను కిందకి దింపి చీరను తొలగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మృతురాలు సోదరుడు మస్తాన్‌బాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2వ నగర పోలీసులు మామ షేక్ కాలేషా, భర్త రహిమాన్, అత్త షేక్ ఖాదర్బీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో మామ కాలేషాపై అత్యాచారం, హత్యానేరాల కింద నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు, జరిమానా, భర్త రహిమాన్పై వేధింపుల కేసు రుజువు కావడంతో ఏడాది జైలు, జరిమానా, అత్త ఖాదర్బీపై నేరం రుజువుకాకపోవడంతో ఆమెపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ కేబీఎస్ మణి కేసు వాదించారు. -
మతం మారాలని అత్తపై దాడిచేసిన కోడలు:కేసు నమోదు
నాగోలు: మతం మారాలంటూ అత్తపై కోడలు దాడి చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ ఎస్బీహెచ్ కాలనీలో నివాసముండే యోగిత, లింగంలు భార్యాభర్తులు. యోగిత కొన్నే ఏళ్ల కిందట మరో మతంలో చేరింది. అలాగే ఇంట్లో ఉంటున్న అత్త వెంకటమ్మను కూడా మత మార్పిడికి పోత్సహించింది. దీంతో ఆమె నిరాకరించడంతో యోగిత అత్తపై దాడి చేసి చంపుతా అని బెదిరించింది.ంతో అత్త ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


