రజాకార్ల పాలన నడుస్తోంది: డీకే అరుణ | DK aruna criticized the Telangana government | Sakshi
Sakshi News home page

రజాకార్ల పాలన నడుస్తోంది: డీకే అరుణ

Oct 14 2015 4:32 PM | Updated on Oct 8 2018 5:04 PM

రాష్ట్రంలో రజాకర్ల పాలన నడుస్తోందని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే ఆరుణ ఆరోపించారు.

రాష్ట్రంలో రజాకర్ల పాలన నడుస్తోందని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే ఆరుణ ఆరోపించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని విమర్శించారు. హత్యలు, ఆత్మహత్యలను సర్కారు ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకేనా.. తెలంగాణ తెచ్చుకుంది అని ప్రశ్నించారు. ల్యాండ్, శాండ్ అన్ని రకాల మాఫియాలతో టీఆర్‌ఎస్ నిండిపోయిందని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement