breaking news
rajakar
-
ఓటీటీలో వివాదాస్పద సినిమా.. 'రజాకార్'పై ప్రకటన
'రజాకార్' చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. తెలంగాణ చరిత్రలో జరిగిన కొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు యాటా సత్యనారాయణ తెలిపారు. మార్చి 15న విడుదలైన ఈ మూవీ ఒక వర్గం వారిని కించపరిచే విధంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్లో కాస్త పర్వాలేదని మెప్పించిన ఈ మూవీ విమర్శల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్కు రాలేదు. అయితే, సుమారు 9 నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుదల కానున్నట్లు 'ఆహా' నుంచి ప్రకటన వచ్చేసింది.గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలయింది. తెలంగాణ పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే 'రజాకార్' నిర్మించినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఆహా' సంస్ధ సొంతం చేసుకుంది. ఈమేరకు తన సోషల్మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది. త్వరలో రజాకర్ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు ఆహా ప్రకటించడంతో సినిమా చూడాలని కోరుకునేవారు సంతోషిస్తున్నారు. అయితే, ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. కానీ, డిసెంబర్ 20న ఓటీటీలో విడుదల కానుందని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే వంటి ముఖ్య నటీనటులు రజాకర్ చిత్రంలో నటించారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
రజాకార్ల పాలన నడుస్తోంది: డీకే అరుణ
రాష్ట్రంలో రజాకర్ల పాలన నడుస్తోందని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే ఆరుణ ఆరోపించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని విమర్శించారు. హత్యలు, ఆత్మహత్యలను సర్కారు ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకేనా.. తెలంగాణ తెచ్చుకుంది అని ప్రశ్నించారు. ల్యాండ్, శాండ్ అన్ని రకాల మాఫియాలతో టీఆర్ఎస్ నిండిపోయిందని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.