ఓటీటీలో వివాదాస్పద సినిమా.. 'రజాకార్‌'పై ప్రకటన | Razakar Movie Expected To Release On This Date, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Razakar Movie OTT Release: ఓటీటీలో వివాదాస్పద సినిమా.. 'రజాకార్‌'పై ప్రకటన

Dec 13 2024 10:10 AM | Updated on Dec 13 2024 10:59 AM

Razakar Movie OTT Streaming Date Details

'రజాకార్‌' చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. తెలంగాణ చరిత్రలో జరిగిన కొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు యాటా సత్యనారాయణ తెలిపారు. మార్చి 15న విడుదలైన ఈ మూవీ ఒక వర్గం వారిని కించపరిచే విధంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్‌లో కాస్త పర్వాలేదని మెప్పించిన ఈ మూవీ విమర్శల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాలేదు. అయితే, సుమారు 9 నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుదల కానున్నట్లు 'ఆహా' నుంచి ప్రకటన వచ్చేసింది.

గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలయింది. తెలంగాణ  పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే 'రజాకార్‌' నిర్మించినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఆహా' సంస్ధ సొంతం చేసుకుంది. ఈమేరకు తన సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ కూడా చేసింది. త్వరలో రజాకర్‌ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ఆహా ప్రకటించడంతో సినిమా చూడాలని కోరుకునేవారు సంతోషిస్తున్నారు. అయితే, ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం రివీల్‌ చేయలేదు. కానీ, డిసెంబర్‌ 20న ఓటీటీలో విడుదల కానుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.

బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌ దేశ్‌ పాండే వంటి ముఖ్య నటీనటులు రజాకర్‌ చిత్రంలో నటించారు. భార‌త‌దేశంలో హైద‌రాబాద్ సంస్థానం విలీనం కావ‌డానికి ముందు ర‌జాకార్లు సాగించిన అకృత్యాల‌ను ఆవిష్క‌రిస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు దర్శకుడు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement