
ట్వీట్‌లో పేర్కొన్నట్టుగానే దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరగడంతో సోషల్ మీడియాలో దీన్ని జనం విపరీతంగా షేర్ చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: దిశ హత్యోందంలో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా సంతోషాన్ని ప్రకటించారు. అయితే ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ అభిమానుల పేరిట డిసెంబర్ 1న చేసినట్టుగా చెబుతున్న ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. ‘కోన్ ఫ్యాన్ క్లబ్’ పేరిట ఉన్న ట్వీట్‌ను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ట్వీట్‌లో పేర్కొన్నట్టుగానే దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరగడంతో సోషల్ మీడియాలో దీన్ని జనం విపరీతంగా షేర్ చేస్తున్నారు.
‘‘సర్ మీరు ఆ నేరస్థులను శిక్షించాలంటే.. వారు నేరానికి పాల్పడిన చోటుకు తీసుకెళ్లండి. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో దిశను కాల్చి చంపిన ప్రాంతానికి వారిని తరలించండి. వాళ్లు పారిపోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు. ఆ సమయంలో పోలీసులకు వారిని షూట్ చేయడం మినహా వేరే ఆప్షన్ ఉండదు. దీని గురించి మరోసారి ఆలోచించండి’’ అని అందులో పేర్కొన్నారు. దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
@konafanclub పేరుతో ట్విటర్‌లో ఎటువంటి అకౌంట్ లేకపోవడంతో ఈ ట్వీట్ నకిలీదని తెలుస్తోంది. ‘దిశ’ కుటుంబ సభ్యులను ఎలా ఓదార్చాలో తెలియడం లేదని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా @konafanclub పేరిట ఈ ట్వీట్‌ను క్రియేట్ చేసినట్టుగా కనబడుతోంది. ఎవరో పబ్లిసిటీ కోసం దీన్ని క్రియేట్ చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత వార్తలు
దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్
నలుగురు మృగాళ్ల కథ ముగిసింది..
ఇంతటితో ‘రేప్’లు తగ్గిపోతాయా!?