వేములవాడ టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గత విబేధాలు | Disagreements In Congress Vemulawada | Sakshi
Sakshi News home page

వేములవాడ టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గత విబేధాలు

Jun 6 2018 6:56 PM | Updated on Mar 18 2019 9:02 PM

Disagreements In Congress Vemulawada - Sakshi

సాక్షి, సిరిసిల్లా :  రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకుల మధ్య  అంత‌ర్గతంగా ఉన్న విబేధాలు మ‌రో సారి భ‌గ్గుమ‌న్నాయి. తాజాగా సిరిసిల్లా జిల్లాలో కొనగాల మహేశ్‌, ఆది శ్రీనివాస్‌ వర్గాలుగా విడిపోయ్యాయి. దీంతో వేములవాడ పట్టణంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు మృత్యుంజయం పాల్గొన్న సమావేశాన్ని  మహేశ్ వర్గం వారు పూర్తిగా  బహిష్కరించడంతో సొంత నియోజకవర్గంలోనే పొన్నంకు చుక్కెదురైంది.

మాజీ ఎంపీ ప్రభాకర్‌ ఒంటెద్దు పోకడలకు విసిగిపోయి.. ఆయన నిర్వహించిన  సమావేశానికి  ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్‌తో సహా, మనోహర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌, గంగాధర్‌, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, సీనియర్‌ నాయకులు దూరంగా ఉన్నారు. వీరంతా కలసి కోరుట్లలో క్యా‍ంప్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వేములవాడలో పార్టీని కాపాడుకునే విషయమై ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్‌ హైదరాబాద్‌ నుంచి చక్రం తిప్పుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement