బాసరకు పోటెత్తిన భక్తులు | devotees rush at Gnana Saraswati Temple | Sakshi
Sakshi News home page

బాసరకు పోటెత్తిన భక్తులు

Feb 12 2017 2:19 PM | Updated on Sep 5 2017 3:33 AM

నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రానికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది.

బాసర: వారాంతం కావడంతో నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. సెలవు రోజు కావడంతో శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అక్షరాభ్యాసాలు, పత్ర్యేక పూజలు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తు‍న్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. అమ్మవారి దర్శానానికి దాదాపు 3 గంటలు సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement