అక్బరుద్దీన్‌ కేసులో అప్పీళ్లకు నిర్ణయం | Decision to appeal in Akbaruddin case | Sakshi
Sakshi News home page

అక్బరుద్దీన్‌ కేసులో అప్పీళ్లకు నిర్ణయం

Jul 16 2017 1:32 AM | Updated on Sep 5 2017 4:06 PM

చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, మజ్లిస్‌ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్

సాక్షి, హైదరాబాద్‌: చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, మజ్లిస్‌ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్‌ బిన్‌ ఒమర్‌ యాఫై అలియాస్‌ మహ్మద్‌ పహిల్వాన్‌తో సహా 10 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ 7వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే దోషులుగా ప్రకటించిన హసన్, అబ్దుల్లా, వాహిద్, వహ్లాన్‌లకు కింది కోర్టు తక్కువ శిక్ష విధించిందని, శిక్ష పెంపు కోసం కూడా అప్పీల్‌ దాఖలు చేయనుంది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సి.ప్రతాప్‌రెడ్డి సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. హైకోర్టులో ఈ అప్పీళ్లు దాఖలు చేసేందుకు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement