ముంబైలో తెలంగాణ సంబరాలు | Day of formation Telangana | Sakshi
Sakshi News home page

ముంబైలో తెలంగాణ సంబరాలు

Jun 3 2016 2:08 AM | Updated on Sep 4 2017 1:30 AM

ముంబైలో తెలంగాణ సంబరాలు

ముంబైలో తెలంగాణ సంబరాలు

ముంబైలోని ములుంద్ ప్రాంతంలో తెలుగు నాఖ వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా....

మెట్‌పల్లిరూరల్ : ముంబైలోని ములుంద్ ప్రాంతంలో తెలుగు నాఖ వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. నాఖ కూడలి వద్ద జాతీయజెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో 14 కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకోవడం అభినందనీయమని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును ఒక జిల్లాకు పెట్టాలని పలువురు కోరారు.

ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలు ఆచార్య జయశంకర్, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్నగౌడ్, దొడ్డి కొమురయ్యలతో పాటు జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే, భగత్‌సింగ్, ఛత్రపతి శివాజి పేర్లుకూడా జిల్లాలకు పెట్టాలని కోరారు. ముంబై తెలంగాణ జేఏసీ కన్వీనర్, ద్రవిడ్ మాదిగ, ముంబై మిల్లు కార్మికుల సంఘం నాయకులు గన్నారపు శంకర్, మంద రాజు, బాలకృష్ణ, బాలనర్సు, ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement