అది పార్టీ నిర్ణయం | Dattatreya on the resignation of the minister | Sakshi
Sakshi News home page

అది పార్టీ నిర్ణయం

Sep 4 2017 3:09 AM | Updated on Sep 17 2017 6:20 PM

అది పార్టీ నిర్ణయం

అది పార్టీ నిర్ణయం

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రిగా పనిచేయ డాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

మంత్రి పదవికి రాజీనామాపై దత్తాత్రేయ

సుభాష్‌నగర్‌ (నిజామాబాద్‌ అర్బన్‌):
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రిగా పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పార్టీ, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానన్నారు. మంత్రి పదవి నుంచి తప్పించడంపై ఆయన పైవిధంగా స్పందించారు.

ఆదివారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పార్టీ,ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. తాము బీజేపీ సిద్ధాంతం కోసం పనిచేసే సైనికులమని, పదవుల కోసం పనిచేసే నాయకులం కాదన్నారు. మోదీతో సమానంగా పనిచేస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణలో ఎవరికీ కేంద్ర కేబినెట్‌లో అవకాశం లభించలేదని, ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement