ఆర్టీసీ కార్మికుల డీఏ పెంపుపై ఉత్తర్వులు | da release for rtc workers | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల డీఏ పెంపుపై ఉత్తర్వులు

May 25 2016 4:13 AM | Updated on Sep 4 2017 12:50 AM

ఆర్టీసీ కార్మికుల డీఏ పెంపుపై ఉత్తర్వులు

ఆర్టీసీ కార్మికుల డీఏ పెంపుపై ఉత్తర్వులు

ఆర్టీసీ కార్మికులకు మే నెలకు సంబంధించి 3.4 శాతం కరువు భత్యం(డీఏ) పెంచుతూ సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మే నెలకు సంబంధించి 3.4 శాతం కరువు భత్యం(డీఏ) పెంచుతూ సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 21.5 శాతంగా ఉన్న కరువు భత్యాన్ని 24.9 శాతానికి పెంచుతూ గత సంవత్సరం నిర్ణయం తీసుకుంది. అయితే నిధుల కొరత వల్ల ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రస్తుత నెలకు సంబంధించి దాన్ని కార్మికులకు అందజేయాలని నిర్ణయించి బుధవారం ఉత్తర్వు జారీచేసింది. అయితే గత సంవత్సరం జూలై నుంచి నవంబర్ వరకు ఐదు నెలలు, పెరిగిన కరువు భత్యానికి సంబంధించి ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న బకాయిలు ఇవ్వకుండా ఒక్కనెల కరువు భత్యం ఇవ్వడం సరికాదని, వెంటనే బకాయిలు మొత్తం విడుదల చేయాలని కార్మిక సంఘం నేతలు ఆర్టీసీ జేఎండీకి విజ్ఞప్తి చేశారు. డీఏ బకాయిలతో పాటు వేతన సవరణ బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు కూడా విడుదల చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement