అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం  | Court Ordered Police To File Case Against Akbaruddin Owaisi | Sakshi
Sakshi News home page

అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం 

Nov 22 2019 4:39 AM | Updated on Nov 22 2019 4:39 AM

Court Ordered Police To File Case Against Akbaruddin Owaisi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను నాంపల్లి కోర్టు గురువారం ఆదేశించింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 153బీ, 506 కింద కేసు నమోదు చేయాలని పేర్కొంది. సీఆర్పీసీ కింద విచారణ జరిపి డిసెంబర్‌ 23న జరిగే తదుపరి విచారణలోగా నివేదిక సమర్పించాలని నాంపల్లిలోని 14వ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశించారు.   

Advertisement
 
Advertisement
Advertisement