రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం | couple commits suicide over family disputes in nalgonda district | Sakshi
Sakshi News home page

రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం

Nov 12 2014 8:22 AM | Updated on Jul 10 2019 7:55 PM

రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం - Sakshi

రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం

క్షణికావేశంతో భార్యభర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన చండూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

*పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం
*అక్కడికక్కడే భార్య.. చికిత్స పొందుతూ భర్త మృత్యువాత
*చండూరు మండల కేంద్రంలో ఘటన

 
చండూరు: క్షణికావేశంతో భార్యభర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన చండూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాతాల రఘు(32) హైదరాబాద్‌కు చెందిన కల్పన(28)ను 3సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. రఘు వృత్తిరీత్యా వైద్యుడు. మండల కేంద్రంలోనే సంజీవిని వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. వీరికి 11నెలల కూతురు(చిన్ని) ఉంది.

కాగా భార్యాభర్తలిద్దరూ ఇటీవల కొన్ని రోజులుగా కుటుంబ విషయాల్లో గొడవ పడుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో  కల్పన పత్తిపంటకు వాడే మోనోక్రొటోఫాస్‌ను తాగింది.  దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనను చూసిన భర్త రఘు తట్టుకోలేక మిగిలిన మందును తాగాడు. ఆపస్మారక స్థితికి చేరిన అతడిని నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రఘు కూడా మృతి చెందాడు.  ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Advertisement
 
Advertisement
Advertisement