దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలకం | Country Politics Main In Telangana MLA Rathod Bapurao | Sakshi
Sakshi News home page

దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలకం

Apr 30 2018 8:01 AM | Updated on Aug 15 2018 9:06 PM

Country Politics Main In Telangana MLA Rathod Bapurao - Sakshi

పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బాపూరావు

నేరడిగొండ(బోథ్‌) : దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలకం కానుందని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మిషన్‌ కాకతీయ నాలుగో విడతలో భాగంగా మంజూరైన రూ.24.60 లక్షలతో మంగల్‌లొద్దిలో ట్యాంక్‌ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెడుతున్న పథకాలు దేశం దృష్టిని ఆకర్శిస్తున్నాయని అన్నారు.

బోథ్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెం.1 ఉండేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ రాథోడ్‌ కమల్‌సింగ్, బోథ్‌ ఏఎంసీ చైర్మన్‌ దావుల భోజన్న, ప్రముఖ కవి జీఆర్‌ కుర్మె, మండల నాయకులు రాథోడ్‌ సజన్, ఆడెపు రమేష్, మందుల రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement