గురుకులాల్లో’ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ | Counseling for entrances | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో’ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

Jun 8 2017 5:12 AM | Updated on Sep 5 2017 1:03 PM

ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ గిరిజన బాలబాలికల జూనియర్‌ కళాశాలల్లో 2017–18 ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి బు«ధవారం అవంతీపురం

మిర్యాలగూడ రూరల్‌ : ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ గిరిజన బాలబాలికల జూనియర్‌ కళాశాలల్లో 2017–18 ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం అవంతీపురం బాలుర కళాశాలలో కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా సాగింది. అవంతీపురం బాలుర కళాశాల, దామరచర్ల, తుంగతుర్తి బాలికల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు 400 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లతో పాటు, కుల, ఆదాయ, ఆధార్‌ జీరాక్స్‌లను పరిశీలించారు. జిల్లా కోఆర్డి నేటర్‌ నూనె కరుణాకర్‌ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల ప్రిన్సిపాల్‌ రాజ్‌గోపాల్, అజయ్, జాను నాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement