ఆర్థిక ఇబ్బందులతో పత్తిరైతు ఆత్మహత్య | cotton farmer suicide in karimnagar | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో పత్తిరైతు ఆత్మహత్య

May 5 2015 10:25 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఆర్థిక ఇబ్బందులతో పత్తిరైతు ఆత్మహత్య - Sakshi

ఆర్థిక ఇబ్బందులతో పత్తిరైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు బలవన్మరణం చెందాడు.

కరీంనగర్ : అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు బలవన్మరణం చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాటారంలో మంగళవారం చోటు చేసుకుంది. కాటారం గ్రామానికి చెందిన గోగుల రాజు (43) పత్తి పంటను తనకున్న రెండెకరాల్లో సాగుచేస్తున్నాడు. పంట దిగుబడి సరిగా లేకపోవడం చేసిన అప్పుల తీరకపోవడంతో రాజు తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement