పత్తిరైతు ఆత్మహత్య | Cotton farmer commits suicide | Sakshi
Sakshi News home page

పత్తిరైతు ఆత్మహత్య

Jan 10 2016 4:22 PM | Updated on Sep 3 2017 3:26 PM

అప్పుల బాధ తాళలేక పత్తి రైతు తనువు చాలించాడు.

అప్పుల బాధ తాళలేక పత్తి రైతు తనువు చాలించాడు. తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక పోవడంతో.. బలవంతంగా తనువు చాలించాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని యానంబయలు పంచాయతి పరిధిలోని మందెరకలపాడు గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది.

గ్రామానికి చెందిన కాటి నారాయణ(38) నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement