పత్తి రైతు ఆత్మహత్య | Cotton farmer commits suicide | Sakshi
Sakshi News home page

పత్తి రైతు ఆత్మహత్య

Jan 3 2016 12:47 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ భరించలేక మరో అన్నదాత బలయ్యాడు.

అప్పుల బాధ భరించలేక మరో అన్నదాత బలయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హాలియ మండలం రంగుండ్ల గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోతు పర్ష్యా(25) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది తనకున్న ఐదెకరాల భూమిలో పత్తి సాగు చేశాడు.. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement