పత్తిరైతు ఆత్మహత్య | Cotton farmer commits suicide | Sakshi
Sakshi News home page

పత్తిరైతు ఆత్మహత్య

Dec 3 2015 2:00 PM | Updated on Aug 29 2018 4:18 PM

పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పుటు రైతు పీక మీద కత్తిలా దాపరించడంతో.. వాటిన తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి తనువు చాలించాడు.

పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పుటు రైతు పీక మీద కత్తిలా దాపరించడంతో.. వాటిన తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా డిండి మండలం కానాపూర్ పంచాయతి పరిధిలోని జోత్యతండాలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నామర్ల శ్రీను(36) తనకున్న ఎనిమిదెరాలతో పాటు మరో ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు.

ఈ క్రమంలో పెట్టుబడుల కోసం భారీ మొత్తంలో ప్రైవేటు వ్యక్తులనుంచి అప్పు తీసుకొచ్చాడు. కానీ పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement