తెలంగాణ: 66 పాజిటివ్‌.. ముగ్గురు మృతి | Coronavirus 66 New Positive Cases Reported In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ: 66 పాజిటివ్‌.. ముగ్గురు మృతి

May 25 2020 10:37 PM | Updated on May 25 2020 10:42 PM

Coronavirus 66 New Positive Cases Reported In Telangana - Sakshi

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉండగా.. వలసదారులు 15 మంది..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనాతో సోమవారం మరో ముగ్గురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 56కి చేరుకుంది. ఇక కొత్తగా మరో 66 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,920 కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉండగా.. వలసదారులు 15 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఒకరు ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. తాజాగా 72 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1164 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 700 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement