తెలంగాణలో కొత్తగా 1,850 కరోనా కేసులు | Coronavirus: 1850 New Positive Cases Registered In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1,850 కరోనా కేసులు

Jul 4 2020 8:55 PM | Updated on Jul 4 2020 10:22 PM

Coronavirus: 1850 New Positive Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,850పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22, 312కు చేరింది.  శనివారం రాష్ట్రవ్యాప్తంగా  ఐదుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 288కు చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 1,572 నమోదయ్యాయి. మిగిలిన వాటిలో రంగారెడ్డిలో 92, మేడ్చల్‌ 53, వరంగల్‌ అర్బన్‌లో 31, కరీంనగర్‌లో 18 కేసులు నమోదయ్యాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1,342 మంది కరోనా నుంచి కోలుకొని డిశార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,487 యాక్టివ్‌ కేసుల ఉన్నాయి. (చదవండి : ‘బిగ్‌బాస్‌-3’ ఫేం రవికృష్ణకు కరోనా..)

Advertisement
 
Advertisement
Advertisement