తెలంగాణ: 164 కేసులు, 9 మంది మృతి | Coronavirus 164 Positive Cases Reported In Telangana State | Sakshi
Sakshi News home page

తెలంగాణ: 164 కేసులు, 9 మంది మృతి

Jun 12 2020 10:24 PM | Updated on Jun 12 2020 10:34 PM

Coronavirus 164 Positive Cases Reported In Telangana State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4484 కు చేరింది. ఇందులో 449 మంది వలసదారులు, విదేశాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. ఇక తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 133 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యవిభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు మీడియా బులెటిన్‌లో పేర్కొన్నారు. మేడ్చల్‌, రంగారెడ్డిలో 6 చొప్పున, సంగారెడ్డి 4, నిజామాబాద్‌ 3, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ములుగు 2 చొప్పున, సిద్దిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్‌, వనపర్తిలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. వైరస్‌ బారినపడ్డవారిలో ఆదివారం 285 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2278కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2032 యాక్టివ్‌ కేసులున్నాయి. కోవిడ్‌ బారినపడి ఇప్పటివరకు 174 మంది మరణించారు.
(చదవండి: కొండపోచమ్మ: సీఎం కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీ)

Advertisement
 
Advertisement
Advertisement