విజయం కోరుతూ.. అరగుండుతో ప్రచారం | Congress Worker Campaign With Different Style | Sakshi
Sakshi News home page

విజయం కోరుతూ.. అరగుండు, అరమీసంతో ప్రచారం

Nov 25 2018 5:18 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Worker Campaign With Different Style - Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి : ఎన్నికల వేళ తమ అభిమాన నాయకున్ని గెలిపించుకునేందుకు కార్యకర్తలు విభిన్న రీతిలో ప్రచారం చేస్తుంటారు. కొందరు గుడికి వస్తాననో.. మరికొందరు కానుకలు వేస్తాననో వేడుకుంటారు. తుంగతుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి అద్దంకి దయాకర్‌ విజయాన్ని కోరుతూ ఓ అభిమాన్ని వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. తుంగతుర్తిలోని లక్ష్మిదేవి కాల్వ గ్రామానికి చెందిన బండి మధు అనే కార్యకర్త అరగుండు, అర మీసంతో ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.

తన అభిమాన నాయకుడు అద్దంకి దయాకర్‌ గెలవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తాను ఈ విధంగా ప్రచారం చేస్తున్నట్లు మధు తెలిపారు. కాగా తుంగతుర్తిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌పై దయాకర్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో మంచి వాగ్ధాటి గల నేతగా గుర్తింపు పొందిన దయాకర్‌ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement