కాకా అంత్యక్రియలు పూర్తి | Congress veteran Kaka Last Rites Completed | Sakshi
Sakshi News home page

కాకా అంత్యక్రియలు పూర్తి

Dec 23 2014 5:54 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో పూర్తయ్యాయి.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో పూర్తయ్యాయి.  పూర్తి అధికార లాంఛనాలతో కాకా అంత్యక్రియలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకుని... వెంకటస్వామి మృతదేహానికి నివాళులర్పించారు.

రాహుల్ గాంధీ వెంట దిగ్విజయ్ సింగ్, జైపాల్రెడ్డి ఉన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, వ్యాపారవేత్తలతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement