అత్యంత విషమంగా ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం..  | Congress Leader Mukesh Goud Health In Critical Condition | Sakshi
Sakshi News home page

అత్యంత విషమంగా ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం.. 

Jul 29 2019 1:13 AM | Updated on Jul 29 2019 11:33 AM

Congress Leader Mukesh Goud Health In Critical Condition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఎం.ముఖేష్‌ గౌడ్‌ (60) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయానికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement