
పార్టీలో చేరిన వారితో సరాఫ్ కృష్ణ
సాక్షి,దామరగిద్ద: నియోజక వర్గం బిడ్డగా తనను ప్రజలు ఆదిరిస్తే ప్రజా సేవకుడిగా పనిచేస్తానని హస్తం గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్తి సరాఫ్ కష్ణ ఓటర్లను కోరారు. మంగళశారం నియోజక వర్గలోని నారాయణపేట, కోయిలకొండ దామరగిద్ద, మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలో శాసన్‌పల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. వెనకబడిన బీసీ వర్గానికి చెందిన తన ను ఎమ్మేల్యే అభ్యర్థిగా ప్రకటించి భరిలో నిలిపిందన్నారు. హస్తంగుర్తుకు ఓటేసి తనను అత్యదిక మెజారితో గెలిపిస్తే పేట నియోజక వర్గంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్‌లు, రైతులకు రూ 2 లక్షల రుణమాఫి, ఆసరా పింఛన్ రూ.2వేలు తదిర పథకాలు వర్తింపజేస్తామన్నారు. కార్యక్రమంలో అమ్మకోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.