తాగిన మైకంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ | Confrontation Between The Two Side In Mahabubnagar District | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

May 14 2018 1:27 PM | Updated on Oct 8 2018 5:07 PM

Confrontation Between The Two Side In Mahabubnagar District - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాట మాట పెరిగి  చివరికి కొట్లాటకే దారి తీసింది ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నవాబుపేట మండలం కాకర్లపాడు ఫతేపుర్‌ మైసమ్మ మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు తాగి మరో వర్గంపై దాడికి దిగారు. రెండు వర్గాలు పరస్పరం వర్గం రాళ్లు రువ్వుకున్నారు.ఈ ఘర్షణలో పది మంది గాయపడగా, మరో వ్యక్తి  స్పృహ కోల్పోయాడు. సుమారు గంటపాటు నడిరోడ్డుపై యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement