breaking news
maisamma devalayam
-
తాగిన మైకంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
సాక్షి, మహబూబ్నగర్ : తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాట మాట పెరిగి చివరికి కొట్లాటకే దారి తీసింది ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నవాబుపేట మండలం కాకర్లపాడు ఫతేపుర్ మైసమ్మ మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు తాగి మరో వర్గంపై దాడికి దిగారు. రెండు వర్గాలు పరస్పరం వర్గం రాళ్లు రువ్వుకున్నారు.ఈ ఘర్షణలో పది మంది గాయపడగా, మరో వ్యక్తి స్పృహ కోల్పోయాడు. సుమారు గంటపాటు నడిరోడ్డుపై యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
66 రోజుల్లో రూ.9.90 లక్షల ఆదాయం
కడ్తాల: మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలం మైసిగండి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మైసిగండి మైసమ్మ తల్లి హుండీ ఆదాయాన్ని గురువారం దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ సమక్షంలో ఈ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 66 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా, రూ. 9,90,323 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ రంగారెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని కడ్తాల కెనరా బ్యాంకులో డిపాజిట్ చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలీ, తలకొండపల్లి తహశీల్దార్ జ్యోతి, రమావత్ భాస్కర్నాయక్, మాజీ ఉప సర్పంచ్ పాండునాయక్ ఆలయ, అర్చక సిబ్బంది యాదగిరిస్వామి, కృష్ణ, చంద్రయ్య, దేవేందర్, బోడియా, రాములు, బాలబ్రహ్మచారి, వెంకటేశ్, లక్ష్మీనారాయణ, భక్తులు పాల్గొన్నారు.