66 రోజుల్లో రూ.9.90 లక్షల ఆదాయం | rs. 9 lakhs income in 66 days of maisamma devalayam | Sakshi
Sakshi News home page

66 రోజుల్లో రూ.9.90 లక్షల ఆదాయం

Aug 6 2015 5:08 PM | Updated on Sep 3 2017 6:55 AM

మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలం మైసిగండి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మైసిగండి మైసమ్మ తల్లి హుండీ ఆదాయాన్ని గురువారం దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు.

కడ్తాల: మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలం మైసిగండి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మైసిగండి మైసమ్మ తల్లి హుండీ ఆదాయాన్ని గురువారం దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ సమక్షంలో ఈ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 66 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా, రూ. 9,90,323 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ రంగారెడ్డి తెలిపారు.

ఈ మొత్తాన్ని కడ్తాల కెనరా బ్యాంకులో డిపాజిట్ చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ శిరోలీ, తలకొండపల్లి తహశీల్దార్ జ్యోతి, రమావత్ భాస్కర్‌నాయక్, మాజీ ఉప సర్పంచ్ పాండునాయక్ ఆలయ, అర్చక సిబ్బంది యాదగిరిస్వామి, కృష్ణ, చంద్రయ్య, దేవేందర్, బోడియా, రాములు, బాలబ్రహ్మచారి, వెంకటేశ్, లక్ష్మీనారాయణ, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement