ముంబై నుంచి వెంటనే రావాలి | Come from Mumbai immediately | Sakshi
Sakshi News home page

ముంబై నుంచి వెంటనే రావాలి

May 29 2017 2:32 AM | Updated on Sep 5 2017 12:13 PM

ముంబై నుంచి వెంటనే రావాలి

ముంబై నుంచి వెంటనే రావాలి

నరేశ్‌ హత్య ఉదంతంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

స్వాతితో ఫోన్‌లో ఎస్సై.. 
 
సాక్షి, యాదాద్రి:  నరేశ్‌ హత్య ఉదంతంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మకూరు(ఎం) ఎస్సై శివనాగ ప్రసాద్‌.. స్వాతితో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ ఆదివారం వాట్సాప్‌లో వైరల్‌ అయింది. నరేశ్‌ను హత్య చేశానని స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఒప్పుకున్న తర్వాత ఇది వెలుగు చూసింది.

స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకూరు (ఎం) పోలీస్‌స్టేషన్‌లో ‘మిస్సింగ్‌’ కేసు పెట్టారు. దీంతో ఎస్సై శివనాగప్రసాద్‌.. నరేశ్‌ చిన్నాన్నతోపాటు మరికొందరిని స్టేషన్‌కు తెచ్చి స్వాతితో  మాట్లాడారు. ‘ మీరు రావాల్సిందే లేకపోతే వీళ్ల పని ఇక్కడ అయితది. భువనగిరిలో డీఎస్పీ ఆఫీస్‌ ఉంటది. నువ్వు డైరెక్ట్‌గా ఆడికి వచ్చి ‘మేం బతికే ఉన్నాం సార్‌..’ అని చెప్పి అట్నుంచి అటే వెళ్లొచ్చు. లేదంటే ఇక్కడ వీళ్లకు ఇబ్బంది అవుతుంది’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement