టాయిలెట్లను శుభ్రం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే | Cleaning toilets, MP, MLA | Sakshi
Sakshi News home page

టాయిలెట్లను శుభ్రం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

Jul 8 2015 1:04 AM | Updated on Aug 28 2018 5:25 PM

టాయిలెట్లను శుభ్రం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే - Sakshi

టాయిలెట్లను శుభ్రం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలోని ఉన్నత పాఠశాలలో చేవెళ్ల ఎంపీ విశేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ...

మొయినాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలోని ఉన్నత పాఠశాలలో చేవెళ్ల ఎంపీ విశేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు టాయిలెట్లను శుభ్రం చేశారు.  మంగళవారం విజయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు పాఠశాలలోని టాయిలెట్లను, మరుగుదొడ్లను పరిశీలించారు. గ్రామంలోని పాఠశాల మధ్యనే మురుగునీటి కాల్వ ప్రవహిస్తుండడంతో దానిపై ఎలాంటి కప్పు లేనందున అధికారులు వెంటనే స్పందించాలన్నారు. బీసీ స్లాబ్ వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, సర్పంచ్‌ను ఆదేశించారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement