కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 29, 30 తేదీలలో సమ్మె చేపడుతున్న సింగరేణి ఉద్యోగులకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) తెలంగాణ కమిటీ పూర్తి మద్దతు తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 29, 30 తేదీలలో సమ్మె చేపడుతున్న సింగరేణి ఉద్యోగులకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) తెలంగాణ కమిటీ పూర్తి మద్దతు తెలిపింది. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని, కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసింది.
సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు బొగ్గు బావుల వద్ద పోలీసులను మోహరించి కార్మికులను నిర్బంధిస్తున్నారని సీఐటీయూ అధ్యక్షడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు ఆరోపించారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని వారిరువురూ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.