‘పాలన మరచి గుళ్ల చుట్టూ ప్రదక్షిణలా?’

Chada Venkata Reddy Comments On KCR - Sakshi

సాక్షి, కరీంనగర్ : ప్రతిపక్షాల అనైక్యతను అవకాశంగా తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని  బీజేపీ పగటి కలలు కంటోందని, కానీ ఇక్కడ అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజా పాలన రాష్ట్రంలో కనుమరుగైందని, సీఎం కేసీఆర్ స్వాములు, గుడుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేసీఆర్ దోషిగా మారక తప్పదు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలపై తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలి ’ అని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top