'కేసీఆర్, బాబులది పరిపక్వత లేని పాలన' | Chada Venkat Reddy takes on Chandrababu and KCR | Sakshi
Sakshi News home page

'కేసీఆర్, బాబులది పరిపక్వత లేని పాలన'

Aug 14 2014 1:29 PM | Updated on Aug 18 2018 6:18 PM

'కేసీఆర్, బాబులది పరిపక్వత లేని పాలన' - Sakshi

'కేసీఆర్, బాబులది పరిపక్వత లేని పాలన'

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర పన్నుతున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర పన్నుతున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మోడీ రెండు నెలల పాలనపై ధ్వజమెత్తారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులపై పరిపాలనపై చాడా వెంకట్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలది పరిపక్వత లేని పాలన అని విమర్శించారు.

ఎంసెట్ కౌన్సెలింగ్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో గవర్నర్ పెత్తనంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల హస్తం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టనున్న ఒక్క రోజు సర్వేపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని చాడా వెల్లడించారు. వాటిని నివృత్తి చేయాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement