వరంగల్‌లో కేంద్ర మంత్రి వెంకయ్య | Central minister Venkaiah naidu visits Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో కేంద్ర మంత్రి వెంకయ్య

Oct 18 2015 10:40 AM | Updated on Sep 3 2017 11:10 AM

కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం ఖిలావరంగల్ కోటను సందర్శించారు.

ఖిలా వరంగల్ : కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం ఖిలావరంగల్ కోటను సందర్శించారు. కేంద్రం తలపెట్టిన హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అగ్మెంటేషన్ యోజన (హృదయ్) పథకాన్ని ప్రారంభించేందుకు ఆయన ఇక్కడికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా భద్రకాళి ఆలయం, వేయిస్తంభాల గుడిలోని శిల్పకళా సంపదను మంత్రి తిలకించారు. 18 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 4.5 కిలోమీటర్ల మేర జరుగుతున్న అగడ్త తవ్వకం పనులను కూడా వెంకయ్యనాయుడు పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement