కేంద్ర నిధులు మళ్లిస్తున్నారు | Central funds are redirected | Sakshi
Sakshi News home page

కేంద్ర నిధులు మళ్లిస్తున్నారు

Apr 25 2017 1:37 AM | Updated on Aug 20 2018 9:18 PM

కేంద్ర నిధులు మళ్లిస్తున్నారు - Sakshi

కేంద్ర నిధులు మళ్లిస్తున్నారు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోగా, వాటిని దారి మళ్లిస్తోందని కేంద్ర తాగునీరు

కేంద్ర మంత్రి రమేశ్‌ జిగాజినాగి

సాక్షి, కామారెడ్డి: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోగా, వాటిని దారి మళ్లిస్తోందని కేంద్ర తాగునీరు, స్వచ్ఛత శాఖల మంత్రి రమేశ్‌ జిగాజినాగి ఆరోపించారు. సోమవారం బీజేపీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం కామారెడ్డిలో జరిగింది.

కార్యక్రమంలో రమేశ్‌ మాట్లాడుతూ  రాష్ట్రంలో కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వచ్చే ఏడాది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement