కేంద్రం ఆర్డినెన్స్‌కు నిరసనగా ముంపు మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది.
భద్రాచలం, న్యూస్‌లైన్: కేంద్రం ఆర్డినెన్స్‌కు నిరసనగా ముంపు మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. అఖిలపక్షం నేతలు రాస్తారోకో, వంటావార్పు, మానవహారాలు నిర్వహించారు. మోడీ, చంద్రబాబు ,వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా, ఎమ్మెల్యే రాజయ్య చేపట్టిన దీక్ష శుక్రవారం నాటికి రెండోరోజుకు చేరింది.